VZM: 2024, 25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కొత్తవలస పంచాయతీకి రూ.3.19 లక్షలు వెచ్చించినట్లు డీఆర్పీ రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం సచివాలయం-5లో నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామసభ సెప్టెంబర్ 28నుండి ఈనెల 12 వరకు ఇంటింటికీ వెళ్ళి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించామని సభలో తెలిపారు. ఇందులో సర్పంచ్ రామస్వామి, రాము, కార్యదర్శి, లెంక శ్రీను, అప్పారావు పాల్గొన్నారు.