KDP: కుమార స్వామి గుప్తా ఒంగోలు ట్రిపుల్ ఐటి ఇంఛార్జ్ డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ డైరెక్టర్గా ఉన్న ఆయనకు, ఇవాళ చాన్సలర్ మధుమూర్తి, రిజిస్టార్ అమరేంద్ర సండ్రలు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఒంగోలు క్యాంపస్ ఇంఛార్జ్ డైరెక్టరుగా ఆయన కొనసాగుతారని అధికారులు తెలిపారు.