KMR: జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ఆశా వర్కర్లు (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా చేపట్టినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.