KMM: గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా మధిర పట్టణంలోని వన్ టౌన్ రామాలయం రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కూలిపోయింది. బ్రహ్మంగారి గుడి వద్ద ఈ ఘటన జరగగా, సమీపంలోని స్తంభం కూడా విరిగింది. రాత్రి సమయం కావడంతో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.