MHBD: జిల్లా కలెక్టరేట్‌ను ఇవాళ మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నాయకులతో కలిసి ముట్టడించారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం, ఎంపీతో పాటు కొందరు నాయకులను పోలీసులు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు అనుమతించారు.