మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ రానున్నారు. నేడు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావులతో కలిసి కురుమూర్తి స్వామిని దర్శించుకోనున్నారు. వారితో పాటు దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జీ. మధుసూదన్ రెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.