PDPL: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఆలయ పర్యవేక్షకులు సునీల్ శాలువాతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు.