KMM: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వేంసూరు మండలంలోని 29 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నిన్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 11,54,500 విలువ గల చెక్కులను ఆమె అందజేశారు.