SDPT: నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త కొబ్బరి చెట్టు మహేందర్ గురువారం మృతి చెందాడు. అది తట్టుకోలేక భార్య కావ్య పురుగు మందు తాగి శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. భార్య భర్తలు ఇద్దరూ 24 గంటల్లోపే మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదం అలుముకుంది.