యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తుల కానుక రూపంలో వచ్చిన హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం ఈరోజు ఉదయం 7 గం లకు కొండ కింద వ్రత మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బంది నిర్ణీత సమయంలోగా పాల్గొనాలని సూచించారు.