JGL: గ్రూప్ -1 నియామకాలలో భాగంగా కేటాయించిన నూతన డీపీవో వై. రేవంత్ బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన డీపీవోను అభినందిస్తూ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకుఅందించాలని సూచించారు.