KMR: మద్నూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ బేకరీలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను ఆర్పీ వేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్సై విజయ్ కొండ ఘటనా స్థలాన్ని పరిశీలించి తెలిపారు.