MDK: తూప్రాన్ పట్టణంలో బుధవారం రెండు మద్యం కాటన్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. తూప్రాన్ మండలంలో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కిష్టాపూర్ మార్గంలో రెండు కాటన్ల బీర్ల మద్యం తరలిస్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.