JN: రఘునాధపల్లి మండలంలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. శ్రీమన్నారాయణ పురం సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తూడి వెంకటేశ్ విజయం సాధించారు. ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన తిప్పారపు రవీందర్‌పై 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.