జగిత్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ పెట్రోల్ బంక్ అసోసియేషన్, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.