NZB: బీసీ-సీ, బీసీ-ఈ కేటగిరీల నుంచి మైనార్టీలను తొలగించి, నిజమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే, ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా చూస్తామని BJP జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు.