MHBD: నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల కోసం భూక్య వెంకన్న తన సొంత ఖర్చుతో బహుకరించిన మినీ వ్యాన్ను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మినీ వ్యాన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భూక్య వెంకన్నను ఎమ్మెల్యే అభినందించారు.