BHNG: జిల్లాలో మద్యం టెండర్లకు భారీగా స్పందన వస్తోంది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. శనివారం ఒక్క రోజే 96 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు గడువు ఈనెల 18న ముగియనుంది. ఇప్పటి వరకు మొత్తం 323 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మరో వారం రోజులు సమయం ఉన్నందున భారీగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.