RR: మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని జహంగీర్ దర్గాలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జేపీ దర్గాతో పాటు మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.