KMR: పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల అన్నారు. నేడు ఎల్లారెడ్డి పట్టణంలోని స్నేహ బాంకెట్ హాల్లో డీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుతో కలిసి నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు.