WGL: వేములవాడ రాజన్న కోడెలను కబేళాలకు తరలించిన విషయమై నేడు మంగళవారం వేములవాడలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి శాంతి హోమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం సిద్దేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ బృందంతో కలిసి వారు వేములవాడకు వెళ్లి హోమం కార్యక్రమంలో పాల్గొంటారు.