ADB: ఆదిలాబాద్‌లోని ఏటీసీలో కొత్తగా ప్రారంభించిన స్వల్పకాలిక సాంకేతిక కోర్సులకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి రెండో బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఆరు రకాల కోర్సుల్లో శిక్షణ అందుబాటులో ఉండగా, ప్రతి కోర్సులో 20 మందికి రెండు వారాల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.