NLG: బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు ఎలా పాలన చేసిందో ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్ కూడా అదే పాలన చేస్తోంది. అదే రకమైన అవినీతి, అదే రకమైన అక్రమాలు ఉన్నాయని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నేటికీ అమలు చేయలేదన్నారు.