WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలోని చెరువు తూములు పాడైపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చెరువు కట్టపై రోడ్డు నిర్మాణ పనుల సమయంలో రెండు తూములు పూడుకుపోయాయని, ఆ తర్వాత మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు అందకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వెంటనే కాంట్రాక్టర్ తూములను బాగు చేయాలని డిమాండ్ చేశారు.