MHBD: కురవిలో “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సభకు హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. DSP తిరుపతిరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.