SDPT: సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో పీఎంశ్రీ రాయపోల్ విద్యార్థిని పూజ ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పోటీల్లో ఆమె ఫిలిప్పీన్స్ దేశ రాయబారిగా ప్రాతినిధ్యం వహించి ప్రశంసలు అందుకున్నట్లు పేర్కొన్నారు. తమ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.