MNCL: కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న HMS గౌరవ అధ్యక్షురాలు కవిత, రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ హైమద్ల అక్రమ అరెస్టులకు ఖండిస్తున్నట్లు HMS యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు రాజబాబు తెలిపారు. శుక్రవారం అరెస్ట్లకు వ్యతిరేకంగా ఏరియా CHPలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేయడం సరికాదన్నారు.