HYD: బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మితమయ్యే ఈ భవనం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని మంత్రులు తెలిపారు.