HYD: సీఎం రేవంత్ రెడ్డితో మేనక గాంధీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు సమగ్రంగా వివరించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రోగ్రాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.