ADB: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూరల్ మండలంలోని జందపూర్, గిమ్మ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.