WGL: జిల్లాలోని ఆయా గ్రామాల్లో బొడ్డెమ్మ పండగ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. బొడ్డెమ్మను పుట్ట మట్టితో అందంగా పేర్చి చెక్క పీటపై కలశం పెట్టీ పసుపు గౌరమ్మను ఉంచుతారు. ఇలా రోజు కాలనీలో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో బొడ్డెమ్మను ఆడుతారు. అమావాస్య ముందు రోజు చెరువులో స్థానిక కుంటల్లో బావుల్లో నిమజ్జనం చేస్తారు.