NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల లోని ప్రభుత్వ బాలుర బీసీ వసతి గృహంలో శనివారం మొక్కలు, నాటే కార్యక్రమం నిర్వహించారు. వసతి గృహం సంక్షేమ అధికారి ప్రసాద్‌తో పాటు విద్యార్థులు పలు రకాల చెట్లను నాటారు. పర్యావరణ పరిరక్షణ కు విద్యార్థులు పాటుపడాలని సూచించారు. మొక్కల పెంపకం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.