RR: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు శ్రీ మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో నూతన సంవత్సరం వేళ గురువారం సుమారు 25 వేల మంది భక్తులు హాజరై, క్యూలైన్లో నిల్చుని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.