ADB: భీంపూర్ మండలంలోని లక్ష్మిపూర్ నుంచి రాజ్డ్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయాల్లో ప్రయాణం మరింత కష్టంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి, రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని కోరుతున్నారు.