BDK: బూర్గంపాడు మండలానికి చెందిన ఓ మహిళ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను ఎస్సై నాగబిక్షం గుర్తించి తిరిగి శనివారం అ మహిళ భర్త సతీష్‌కు అందజేశారు. ఫోన్ కనిపించకపోవడంతో ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కనుగొన్నారు. ఫోన్ తిరిగి లభించడంతో బాధిత కుటుంబం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.