నారాయణపేట: నారయణపేట మండలం అప్పంపల్లి మెడికల్ కళాశాల వద్ద ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పరిశీలించారు. సభ స్థలం, వేదిక, పార్కింగ్ స్థలాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.