HYD: ప్రస్తుత సీజన్లో వర్షపాతం కంటే 45 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు పెరిగాయి. హైదరాబాద్లో 0.75 అడుగులు, రంగారెడ్డి జిల్లాలో 1.94 అడుగులు, మేడ్చల్ జిల్లాలో 2.64 అడుగులు పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే సగటున 2 నుంచి 3 అడుగులు పెరిగినట్లు భూగర్భ జలాల శాఖ అధికారి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.