JNG: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటం దేవేంద్రను గెలిపిస్తే కునూర్ గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకువస్తానని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి తెలిపారు. జఫర్గడ్ మండలం కోనూరులో సర్పంచ్ అభ్యర్థి గెలుపుకై కడియం మంగళవారం ప్రచారం నిర్వహించారు. దేవేంద్రను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని కడియం హామీఇచ్చారు.