MBNR: జిల్లాలో నేరస్తులకు శిక్షలు పడటంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డి. జానకి సన్మానించారు. మూడు పోక్సో కేసులు, ఒక దోపిడీ కేసు, ఒక అత్యాచార కేసులో పక్కా ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్షలు పడేలా చేసిన అధికారులను ఆమె ప్రశంసించారు. దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారుల కృషిని ఎస్పీ అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సమర్థంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.