జనగామ పట్టణ కేంద్రంలో ఇవాళ BC రాష్ట్ర బంద్ సందర్భంగా కాంగ్రెస్, BRS నాయకులు ఘర్షణకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ ఓట్ల కోసం డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడి వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహించారు. అతడిపై దాడి చేసేందుకు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. మిగతా నాయకులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.