ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తుంది.