NRML: ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది జాబితా రెండు రోజులలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వారు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.