NGKL: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సంబంధిత శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. జిల్లాలోని పలు మండలాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వెనుకబడి ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణంపై బుధవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు.