HYD: జీడిమెట్లలో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం నిలిపిన ట్రాఫిక్ మార్షల్ శివకుమార్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావు భూపాల్ అభినందించారు. సూరారం చౌరస్తాలో కుప్పకూలిన రహీంకు శివకుమార్ వెంటనే సీపీఆర్ చేయడంతో అతడు సృహలోకి వచ్చి ఆసుపత్రిలో కోలుకున్నాడు. సమయానికి చేసిన స్పందన ప్రాణం నిలిపింది.