MNCL: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 48 కేంద్రాల్లో ఉ.9.30 నుంచి 12.30 వరకు జరిగే పరీక్షలకు 4, 897 మంది బాలురు, 4,806 మంది బాలికలు హాజరుకానున్నారని పేర్కొన్నారు.