KMM: ఆడబిడ్డల శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి నాగేశ్వరరావు, రామారావు అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామపంచాయతీలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పథకం ఓ వరంగా మారిందని ఆయన పేర్కొన్నారు.