WNP: ప్రజలు ఎలాంటి భయం లేకుండా, పైరవీలకు దూరంగా స్వేచ్ఛగా పోలీసుల సేవలను వినియోగించుకోవచ్చని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు.