KMM: ఖమ్మం 23వ డివిజన్ ముస్తాఫ్ నగర్ రోడ్ నెం.3లో నెలకొన్న విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ షేక్ మక్బుల్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. డివిజన్లో నూతన రోడ్లు, డ్రైనేజీ మంజూరైన నేపథ్యంలో పనులు ప్రారంభం కాకముందే నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు.