ADB: భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సర్వే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. బోరజ్, భీంపూర్, తాంసి మండలాల్లోని భూసేకరణ పురోగతిపై క్షేత్రస్థాయిలో సర్వేయర్లు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.