ASF: ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ పాత కలెక్టర్ కార్యాలయంలో గురువారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు TASK TRAINING CENTRE ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.